అనంతపురం జిల్లాలో ఎస్ఈబీ ఆధ్వర్యంలో కొనసాగిన దాడులపై పోలీస్ కార్యాలయం నుంచి వివరాలతో అధికారులు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా, నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. 3,491 టెట్రా పాకెట్లు, 191 మద్యం సీసాలు, 25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 1900 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి, 35 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 51 మందిని అరెస్టు చేసి.. 17 వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. ఇసుక అక్రమాలపై 2 కేసులు నమోదు చేసి ముగ్గురు అరెస్టు, 3 వాహనాలు, 7 టన్నుల ఇసుక సీజ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.
ఎస్ఈబీ దాడులపై ప్రకటన.. 54 మంది అరెస్ట్ - అనంతపురం జిల్లా తాజా మద్యం సీజ్ వార్తలు
అనంతపురం జిల్లాలో ఎస్ఈబీ ఆధ్వర్యంలో జరిగిన దాడులపై పోలీస్ కార్యాలయం పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేసింది. మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీ, ఇసుక తరలింపు వంటి కేసుల్లో మొత్తంగా 54 మందిని అరెస్టు చేసి 20 వాహనాలు సీజ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.
anantapur dst release a letter abut attacks on illegal works in the district