లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరకులు తీసుకోవడానికి వెళ్లే ద్విచక్రవాహన చోదకులను పోలీసులు జరిమానాలతో బెంబేలెత్తిస్తున్నారు. అధికారులు ఇచ్చిన సమయంలోనే కూరగాయలు, ఇతర అవసరాల కోసం బయటకు వచ్చేవారికి పెద్ద మొత్తంలో అనంతపురం జిల్లా కదిరి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలను గుర్తుచేస్తే వాహనాన్ని స్టేషన్కు తరలించి మరింత ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తామని బెదిరిస్తున్నారని వాహనచోదకులు వాపోతున్నారు.
పోలీసులకు వాహనచోదకులకు మధ్య వాగ్వాదం - anantapur dst police fine news
అనంతపురం జిల్లా కదిరి పోలీసులు ద్విచక్రవాహన చోదకులకు భారీ మొత్తంలో జరిమాన వేస్తున్నారని... కొందరు వాపోతున్నారు. నిత్యాసర సరకులు తీసుకెళ్లడానికి వచ్చే వాహనాలపైనా అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
anantapur dst police takes fines on two wheeler drivers