తాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా కదిరి మండల పరిషత్ కార్యాలయాన్ని మొటుకు పల్లి గ్రామస్తులు ముట్టడించారు. గ్రామంలోని బోరు బావుల్లో నీరు తగ్గిపోయి తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నీటి కష్టాలను తెదేపా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి బోర్ వేయించారన్నారు.
పుష్కలంగా నీరు ఉన్న ఈ బోరు నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి తాగు నీటిని అందించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదు అంటూ భీష్మించుకుని కూర్చున్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎంపీడీవో రమేష్ బాబు, తహసీల్దార్ మారుతి, సిఐలు నిరంజన్ రెడ్డి, రామకృష్ణ హామీ ఇవ్వగా.. గ్రామస్తులు ఆందోళన విరమించారు.