దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా... అవేమి తమకు వర్తించవంటూ గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని కొందరు. 2 నెలల నుంచి లాక్ డౌన్ వల్ల ఆస్తుల కొనుగుళ్ల నమోదు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గుత్తి పట్టణంలో ఒక్కసారిగా రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకోవటంతో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు మరచి ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా... భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు.
రిజిస్ట్రార్ కార్యాలయం ముందు గుంపులుగా చేరిన ప్రజలు
లాక్ డౌన్ నిబంధనలను కొందరు విస్మరిస్తున్నారు. తమ పనులు చేయించుకోవాటనికి బయటకు వస్తూ...కనీసం మాస్కులు ధరించకపోగా గుంపులు గుంపులుగా చేరి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు అనంతపురం జిల్లా గుత్తిలోని కొందరు.
anantapur dst guthi people not maintaining social distance in resistor office