ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంత్యక్రియలకు రూ.60వేలు డిమాండ్​..ఆస్పత్రి సిబ్బంది ఆడియో వైరల్

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణాలు ఆగటం లేదు. ఇక్కడ చికిత్సలు సరిగా అందక, ఆక్సిజన్ లేక చనిపోతున్న సంఘటనలే కాదు.. కనీసం వీల్​చైర్లు లేక చేతుల మీద మోసుకొస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు రోగులు చనిపోతే కరోనా బూచిగా చూపి అంత్యక్రియలకు వేలకు వేలు గుంజే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆస్పత్రి సిబ్బంది బేరాలడిన ఆడియో వైరల్ అయింది...

anantapur dst govt hospital staff take too much money from corona victim families
anantapur dst govt hospital staff take too much money from corona victim families

By

Published : Jul 27, 2020, 2:49 PM IST

మృతుని బంధువులతో సిబ్బంది బేరాలాడుతున్న ఆడియో

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది పేదల నుంచి వేలకు వేలకు వసూలు చేస్తున్నారు. కరోనాతో చనిపోతే పేదలు అంత్యక్రియలకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.

తాజాగా ఒక నిరుపేద వ్యక్తి అంత్యక్రియలకు రూ.60వేలు డిమాండ్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం నందమూరినగర్​కు చెందిన బొమ్మయ్య అనే వ్యక్తి ఊపిరాడని పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చాడు. అయితే అక్కడ కనీసం వీల్​చైైర్ కూడా లేకపోవటంతో బంధువులు చేతుల మీద తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. బొమ్మయ్య చికిత్స పొందుతూ చనిపోయాడు.

వార్డులోని సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించేందుకు 60వేల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు రూ.45వేలకు తక్కువ చేయమని తెగేసి చెప్పారు. వారు డబ్బు డిమాండ్ చేసిన సంఘటన ఆడియో వైరల్​గా మారింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సరిగా అందకపోటమే కాకుండా ఇలా చనిపోయిన తరువాత కూడా జలగల్లా పీడిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి

లక్షకు చేరువలో కరోనా కేసులు... వెయ్యికిపైగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details