తమ గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంటలో కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి స్థానికులు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. గాండ్లపెంట మండలం కటకంవారిపల్లి, తూపల్లి గ్రామాలలో కొన్ని నెలలుగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించలేదని తెలిపారు. మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్న విషయాన్ని తెలుసుకున్న మహిళలు గాండ్లపెంట చేరుకుని ప్రధాన రహదారిపై ఆయనను అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే.. తాగునీటి పథకాలను వెంటనే పునరుద్ధరించి సమస్యలు పరిష్కరించాలని మండల్ పరిషత్ అధికారులకు సూచించారు.
ఆ ఎమ్మెల్యేను రోడ్డుపైనే అడ్డుకున్న మహిళలు... - anantapur dst taja news
తాగునీటి సమస్యని తక్షణమే పరిష్కరించాలని అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఎమ్మెల్యే సిద్దారెడ్డిని మహిళలు అడ్డుకున్నారు.చుక్కనీరు కూడా లేకుండా ఎలా బతకాలని నిలదీశారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే.. పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
anantapur dst gandlapenta laddies shock to kadiri mla about water problems