అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో జిల్లా అధికారులు లాక్ డౌన్ అమలుకు కఠిన చర్యలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు హెచ్చరికలు జారీ చేసి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు.
అనంతపురంలో మళ్లీ ఆంక్షలు...ఆ టైంలోనే బయటకు రావాలి! - anantapur corona cases list
అనంతపురంలో అధికారులు లాక్ డౌన్ అమలును కఠినతరం చేశారు. ఉదయం 10గంటల వరకే రాకపోకలు సాగించేలా చర్యలు చేప్టటారు. అయితే ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Anantapur dst covid cases incrasing police implementing sudden lock down