నేటి నుంచి.. రవాణా కార్యాలయం సేవలు ఆన్ లైన్ లో పొందవచ్చని అనంతపురం ఉప రవాణా కమిషనర్(డీటీసీ) శివరాంప్రసాద్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా రవాణా సేవలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామన్నారు. మొత్తం 18 రకాల సేవలను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చన్నారు. ఎల్ఎల్ఆర్, పర్మినెంట్ లైసెన్స్, వెహికల్ ఫిట్ నెస్ కు మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుందని.. ఇక మిగిలిన అన్ని సేవలు ఆన్ లైన్ లో పొందవచ్చన్నారు.
నేటి నుంచి.. అందుబాటులోకి రవాణా ఆన్లైన్ సేవలు - అనంతపురం జిల్లా వార్తలు
18 రకాల రవాణా కార్యాలయ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చామని అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ తెలిపారు. ఎల్ఎల్ఆర్, పర్మినెంట్ లైసెన్స్, వెహికల్ ఫిట్ నెస్ కు మాత్రమే కార్యాలయానికి రావాలని, మిగిలిన అన్ని సేవలను ఆన్లైన్లో పొందాలని సూచించారు. కరోనా ఉద్ధృతి కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
![నేటి నుంచి.. అందుబాటులోకి రవాణా ఆన్లైన్ సేవలు అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8096107-80-8096107-1595230693096.jpg)
అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్
గతంలో ఉన్న వేలిముద్ర పద్ధతిని ఓటీపీ ద్వారా సేవలు పొందేలా మార్పు చేసినట్లు శివరాంప్రసాద్ తెలిపారు. ఆన్ లైన్ సేవల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే.. వాట్సప్ నంబర్లు ద్వారా తెలియజేయవచ్చని చెప్పారు. అనంతపురం డీటీసీ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలనుకుంటే 9493996060 నంబరు, హిందూపురం కార్యాలయానికి అయితే 9908796997 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి :కళ్లముందే పిల్లను కోల్పోయిన తల్లి శునకం.. మూగ రోదన