అనంతపురం జిల్లా మడకశిరలో గత కొన్ని రోజులుగా ఓ మహిళ రావి చెట్టు కిందే కాలం వెళ్లదీస్తోంది. ముక్కుపచ్చలారని ఇద్దరు కుమారులతో బతకుబండి సాగిస్తోంది. ఆమె పరిస్థితిపై ఆరా తీస్తే... కన్నీళ్లకేకన్నీళ్లు తెప్పించింది ఆమె దీనగాథ. మడకశిర మండలంలోని యు.రంగాపురం చెక్పోస్ట్ గ్రామానికి చెందిన ఆమె భర్త మూడు నెలల క్రితం ఓ ప్రాణాంతక వ్యాధితో చనిపోయాడు. నా అన్న వారు ఎవరూ లేరు. భర్త మరణంతో సంపాదన లేక ఇలా రోడ్డున పడింది. తరచూ అనారోగ్యం బారిన పడిన ఆమెనూ అదే మహహ్మారి మింగేస్తోందని తెలిసింది.
చావంటే భయం లేదు... బిడ్డల కోసమే బెంగంతా - woman suffering from life-threatening disease
ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ మరణానికి సమీపంలో ఉన్నామనీ... బతకడానికి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందనీ తెలిసేవారి బతుకు ఎంతో దయనీయం. ఊహించుకుంటేనే భయం కలుగుతోంది కదూ. తప్పు చేసి ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఓకే... కానీ ఏ తప్పూ చేయకున్నా అలాంటి పరిస్థితి ఎదుర్కోవడం మరింత బాధాకరమంటోంది అనంతపురం జిల్లా మడకశిరకి చెందిన బాధితురాలు. జీవితంపై తనకు ఆశ లేకున్నా... పిల్లల కోసమైనా బతకాలని పరితపిస్తోంది.
భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న అనంతపురం మహిళ
అప్పటి వరకు దారినపోయే వారు చేసే సాయంతో నెట్టుకొచ్చిన ఆమెను ఒక్కసారిగా నిశ్శబ్ధం ఆవరించింది. భయం మొదలైంది. భర్త మరణంతోనే అన్నీ వదిలేసుకున్న ఆమెకు... చావు పెద్ద కష్టంగా అనిపించడం లేదు. కానీ పిల్లలు ఏమైపోతారనే ఆలోచనే ఆమెను కుంగదీస్తోంది. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది.
ఇవీ చదవండి...బతుకు బండి ఆగింది.. జీవనం భారంగా మారింది..