అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని.. వివిధ పార్టీల అభ్యర్థులు ఉద్ధృతం చేశారు. మార్చి 3న జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం బరిలో ఉండే ఆభ్యర్థులు తేలనున్నారు. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమయ్యాయి. తెదేపా అభ్యర్థుల తరుపున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, వైకాపా తరుపున ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి పురపోరు ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని వార్డులన్నీ తిరుగుతూ తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పురపోరు: తాడిపత్రిలో జోరుగా ప్రచారం - పురపోరుకు రంగం సిద్ధం న్యూస్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో నాయకులు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 3న జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం బరిలో ఉండే అభ్యర్థులు తేలనున్నారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో ఓటర్లు ఎంతమంది..?
2019 జాబితా ప్రకారం తాడిపత్రి మున్సిపాలిటీలో 83,739 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 41,341 మంది పురుష ఓటర్లు కాగా.. 42,383 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 208 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వైకాపా నుంచి 127, తెదేపా నుంచి 51, భాజపా నుంచి 5, సీపీఐ నుంచి 8, జనసేన పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లుగా 13 మంది పోటీలో నిలిచారు. ఎన్నికల నిర్వహణ కోసం పట్టణవ్యాప్తంగా ఉన్న 36 వార్డులకు గానూ.. 83 పోలింగ్ బూత్‌లను ఆధికారులు ఏర్పాటు చేశారు.