police rescue abducted children : అనంతపురం జిల్లా కదిరి మండలంలో అపహరణకు గురైన ఇద్దరు చిన్నారులను పోలీసులు కాపాడారు. తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన శ్రీనివాసులు తన సమీప బంధువైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రాజు వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేసినా లాభం లేకపోయింది. అప్పు విషయమై ఇద్దరి మధ్య ఆదివారం పంచాయితీ జరిగింది.
Kidnap: చిన్నారుల కిడ్నాప్.. కాపాడిన పోలీసులు - చిన్నారుల కిడ్నాప్
police rescue abducted children : అపహరణకు గురైన చిన్నారులను అనంతపురం జిల్లా పోలీసులు కాపాడారు. తండ్రి చేసిన అప్పును వసూలు చేసుకోవటం కోసం పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పిల్లలు అపహరించుకెళ్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
![Kidnap: చిన్నారుల కిడ్నాప్.. కాపాడిన పోలీసులు abducted children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14392798-899-14392798-1644203758440.jpg)
abducted children
శ్రీనివాసులు డబ్బు చెల్లించనందున.. ఆయన ఇద్దరు పిల్లలను రాజు అపహరించుకొని వెళ్లాడు. అప్పు తిరిగి చెల్లించాకే పిల్లలను పంపుతానని తేల్చి చెప్పాడు. అప్పు వసూలు కోసం పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పిల్లలు అపహరించుకెళ్తున్న రాజును కదిరి మండలం పట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి
Anantapur Accident News:పెళ్లి కుమార్తె కాళ్లపారాణి ఆరకముందే..
Last Updated : Feb 7, 2022, 11:37 AM IST