ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇదేం ఖర్మ'లో వైసీపీపై విరుచుకుపడిన యువకుడు - Anantapuram district today news

young person comments on ycp: వైసీపీ నాయకుడి కుమారుడు టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. రాష్ట్ర యువతకు ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని మండిపడ్డాడు. వాలంటీర్ల వ్యవస్థను ఎందుకు పెట్టారో? స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్పాడు.

anathapuram
ఇదేం ఖర్మలో మహంతపురం యువకుడు

By

Published : Jan 3, 2023, 2:01 PM IST

Updated : Jan 3, 2023, 3:02 PM IST

young person comments on ycp: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మహంతపురంలో టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు గతరాత్రి 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయనకు గ్రామస్తులు డప్పులతో, బాణ సంచాలను కాల్చుతూ స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వర నాయుడు ఇల్లిల్లు తిరిగి ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టి, రచ్చకట్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడి కుమారుడు జై కుమార్ మైక్ అందుకొని.. వైసీపీపై విరుచుకుపడ్డాడు.

''పక్క రాష్ట్రంలో డీజిల్ ధరలను.. మన రాష్ట్రంలో డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. మన రాష్ట్రంలో నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. యువతకు ప్రభుత్వం ఏమాత్రం సదుపాయాలు కల్పించడం లేదు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు?. గ్రామాల్లో కనీస వసతులైన విద్యుత్, రోడ్లు వంటి వాటిని కూడా గాలికి వదిలేశారు. నేను, నా కుటుంబం వైకాపాకు సానుభూతిపరులైనా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతున్నానని ఏం చేసుకుంటారో చేసుకోండి'' అని యువకుడు ధ్వజమెత్తాడు. ఆ యువకుడి మాటలను విన్నా ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు అభినందించారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 3, 2023, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details