అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.