అనంతపురం జిల్లా కదిరిలో ప్రజావేదిక నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల్లో సరైన నివేధికలు సమర్పించని నిధులను వెనక్కి చెల్లించాల్సిందిగా ప్రజావేదికలో అధికారులు తెలిపారు. మండలంలో ఏడాది కాలంలో 1వేయి 4వందల19 పనులకు 11.46 కోట్లు ఖర్చు చేశారు. అన్ని శాఖలకు సంబంధించి అవకతవకలు ఉన్నాయి. సరైన ఆధారాలు చూపాలని 87వేల రూపాయలను రికవరీకి ఆదేశించారు.ఇందులో అత్యధికంగా ఉపాధి హామీ పథకం నుంచి 53 వేల రూపాయలు రికవరీ చేయాల్సిందిగా ప్రజావేదికలో తేల్చారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి 33 వేలు వెనక్కి తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
కదిరిలో ప్రజావేదిక....నిధుల్లో తేలిన అవకతవకలు - ప్రజావేదిక
అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధి హామీకి సంబంధించి ప్రజావేదిక నిర్వహించారు.ఈ వేదికలో వివిధ శాఖలుకు కేటాయించిన అభివృద్ది పనుల్లో అవకతవకలు ఉన్న నిధులను రికవరీకి ఆదేశించారు.
ప్రజావేదికలో మాట్లాడుతున్న అధికారులు