Guntakal RTC depot diesel tanker seized: అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపోకు ఇంధన సరఫరా చేస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆర్టీసీ డిపోలోని బస్సులకు ఇంధనం నింపడం కోసం కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు.. అధికారులు అనుమతించిన ప్రదేశం నుండి కాకుండా.. మరో ప్రాంతం నుండి ఇంధనాన్ని డిపోకు సరఫరా చేస్తుండగా అధికారులు గమనించి పట్టుకున్నారు. అయితే.. టెండర్ పొందిన వ్యక్తి మాత్రం తమకు అన్ని బిల్లులు సక్రమంగా ఉన్నాయని, అనుకూలమైన ప్రాంతం నుండే ఇంధనం సరఫరా చేయడానికి తమకు అన్నీ అనుమతులు ఉన్నాయంటూ అధికారులతో వాగ్వావాదానికి దిగారు.
మొదట్లో అనధికారిక ప్రాంతం నుండి ఇంధనం తీసుకొని.. ఆర్టీసీ డిపోకు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు.. ఆర్టీసీ డిపోలో తనిఖీలకు వెళ్లి ఆర్టీసీ సిబ్బందికి, రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. పర్మిషన్ లేకుండా ఆర్టీసీ డిపోలోకి ఎలా ప్రవేశిస్తారు? అంటూ హంగామా సృష్టించారు. గుంతకల్లు ఆర్టీసీ డిపోకు గార్లదిన్నెలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ నుండి ఇంధనం సరఫరా చేయాల్సి ఉండగా.. సుదూర ప్రాంతంలోని మడకశిర నుండి డీజిల్ సరఫరా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.