గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటుతోనే గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతుందని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు. నంబులపూలకుంట, తలుపుల మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలు, గ్రామసచివాలయాలను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
అనంతరం వెలిచెలమ, పెద్దన్నవారిపల్లి రైతు భరోసా చైతన్యయాత్రల్లో పాల్గొన్నారు. అన్నదాతలకు అన్నీ సేవలను గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భరోసా కేంద్రం ద్వారా అందే సేవలను వివరించి సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. రైతులు ఈ సేవలను వినియోగించుకోవడం ద్వారా వ్యయ ప్రయాసలు తగ్గుతాయన్నారు.