ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్క రోజు కలెక్టర్​కు 'చంద్రుడు' సాయం - anantapur district latest news

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మంచి మనసు చాటుకున్నారు. ఒక్కరోజు కలెక్టర్​గా విధులు నిర్వర్తించిన ఇంటర్ విద్యార్థిని శ్రావణి చదువుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. బాలికను బాగా చదివించాలని ఆమె తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు.

one day collector
one day collector

By

Published : Oct 23, 2020, 5:35 AM IST

విద్యార్థిని కుటుంబంతో మాట్లాడుతున్న కలెక్టర్

'బాలికే భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు అనంతపురం జిల్లాకు ఒక్క రోజు కలెక్టర్​గా విధులు నిర్వర్తించిన విద్యార్థి శ్రావణిని కలెక్టర్ గంధం చంద్రుడు అభినందించారు. బాలికను ఉన్నత చదువులు చదివించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని వారికి కలెక్టర్ చంద్రుడు హామీ ఇచ్చారు. గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామంలోని విద్యార్థిని శ్రావణి ఇంటికి కలెక్టర్ గురువారం వెళ్లారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు.

'విద్యార్థిని శ్రావణికి వచ్చిన అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఆమెను బాగా చదివించండి. చదువుకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం. అమ్మాయి పేరు మీద బ్యాంకు ఖాతా తెరచి కొంత డబ్బును ఫిక్స్​డ్ డిపాజిట్ చేస్తాం. ఆ డబ్బును అమ్మాయి చదువు కోసం ఉపయోగించండి' అని బాలిక తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో కలెక్టర్ అయ్యేలా బాగా చదువుకోవాలని శ్రావణికి చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినికి చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు నాగవేణికి కలెక్టర్ ఫోన్​ చేసి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details