అనంతపురం జిల్లాలో అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. 15 వేల మంది రైతుల పంటలు పాడైనట్లు గుర్తించామని ఆయన తెలిపారు. 14 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ కలిపి రూ. 39 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు అంచనా వేశామని..వీటి వివరాలను ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. జిల్లాలో ఇన్‌పుట్ సబ్సిడీ కింద మొదటి విడత రూ. 5500 చొప్పున, రూ. 14 కోట్లు ఇచ్చామని తెలిపారు.
'వర్షాలతో రూ. 39 కోట్ల రూపాయల నష్టం జరిగింది' - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లాలో వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు.
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు