అనంతపురం జిల్లాలో తొలి విడత కదిరి డివిజన్లో ఎన్నికలకు రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. డివిజన్లోని 12 మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 470 మంది నామినేషన్లు వేశారు. వైకాపా, తెదేపా, భాజపాతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ రెండో రోజు ఉత్సాహం కనిపించింది.
రెండోరోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ - అనంతపురం ఎన్నికల వార్తలు
అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగింసింది. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియను, శాంతి భద్రతలను జిల్లా కలెక్టర్, ఎస్పీలు పర్యటించి స్వయంగా పరిశీలించారు.
రెండోరోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఈ డివిజన్లోని 169 పంచాయతీల పరిధిలో 700 మంది వార్డులకు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో మొత్తం 545 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 777 మంది వార్డుల్లో పోటీకి నామినేషన్ వేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు లు జిల్లా వ్యాప్తంగా పర్యటించి నామినేషన్ల ప్రక్రియ, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చదవండి:'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక