అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలకు రాష్ట్ర కమిటీలో కీలక పదవులు దక్కాయి. కదిరికి చెందిన భాజపా నేత, ఇప్పటివరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగిన ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి... సోము వీర్రాజు జట్టులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. మరో సీనియర్ నాయకుడు కదిరికి చెందిన గుడిసె దేవానంద్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు.
భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, దేవానంద్లకు కొత్తగా ఏర్పడిన భాజపా రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు దక్కడం పట్ల అనంతపురం జిల్లా భాజపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి, దేవానంద్ తెలిపారు.