అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని గంతిమర్రిపల్లి గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయ నిర్మాణం ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భవనాలు నిర్మించే స్థలాలు...గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని స్థానికులు అంటున్నారు. గ్రామంలోని కొందరు నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 1992లో ఇళ్ల స్థలాలు కేటాయించినా ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు.
గంతిమర్రిపల్లి సచివాలయ నిర్మాణ స్థలంపై వివాదం - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం జిల్లా గంతిమర్రిపల్లిలో సచివాలయ నిర్మాణ స్థలంపై వివాదం నెలకొంది. సచివాలయం నిర్మిస్తున్న స్థలం గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని గ్రామస్థులు కొందరు ఆందోళనకు దిగారు. గ్రామంలోని కొందరు నేతల ప్రోద్బలంతో అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాలకు ఈ స్థలం వినియోగిస్తే...తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు.
gantimarripalli village
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అధికారులు...ఈ భూములు స్వాధీనం చేసుకున్నారని గ్రామస్థులు అంటున్నారు. ఇళ్లు, పునాదులు కూల్చేశారని ఆరోపిస్తున్నారు. బాధితులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. ఇంటి స్థలాలు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభం