ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా బాధితులకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు నాణ్యమైన భోజనం'

కరోనా బాధితులకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. వారి కోసం భోజనం తయారు చేసే ప్రాంతాలను.. ఆయన పరిశీలించారు. కొవిడ్ బాధితులకు చేసే ఖర్చు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.

collector visit food centre
అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు

By

Published : May 6, 2021, 8:55 PM IST

జిల్లా వ్యాప్తంగా చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో నగర శివారులోని శిల్పారామంలో నిత్యం 1800 మందికి పైగా ఆహారాన్ని తయారు చేస్తున్నామన్నారు.

కరోనా సోకిన ఒక్కో వ్యక్తిపై రూ. 350 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భోజనం తయారీ ప్యాకింగ్​లో ప్లాస్టిక్ వాడకం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కొవిడ్ బాధితులకు చేసే ఖర్చు విషయంలో రాజీ పడబోమని ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details