అనంతపురం నగర మేయర్ వసీం అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఇంతకు ముందు కార్పొరేటర్లుగా పని చేసిన ఐదుగురిని మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు. అనంతరం నగరంలో పారిశుద్ధ్య సమస్యపై కార్పొరేటర్లు తమ వాదనలు వినిపించారు.
అనంతపురం నగర పాలక కౌన్సిల్ సమావేశం.. హాజరైన ఎమ్మెల్యే - today anantapuram district Council meeting news
అనంతపురం నగర పాలక మేయర్ వసీం అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఇంతకు ముందు కార్పొరేటర్లుగా పని చేసిన వారిలో మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యులుగా ఐదుగురిని ఎంపిక చేశారు.

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
కరోనా నేపథ్యంలో నియమించిన పారిశుద్ధ్య కార్మికులను కరోనా అనంతరం కూడా కొనసాగించాలని తెలిపారు. ఇంటింటికి చెత్త సేకరణ అమలుకావడం లేదని, దీనిపై దృష్టి సాధించాలని కోరారు. ఎమ్మెల్యే, మేయర్ డిప్యూటీ కమిషనర్ త్వరలో అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోఆప్షన్ సభ్యులు అన్ని వార్డులు అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఇవీ చూడండి…:రూ.20 లక్షల కొవిడ్ మందులను అందించిన బాలయ్య