ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో నిర్బంధ తనిఖీలు.. అనుమానితుల ఇళ్లలో సోదాలు - police conducted in cordon and searches in anantapur

అనంతపురంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని తెలిపారు.

cordon and searches
అనంతపురంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

By

Published : Mar 2, 2021, 12:36 PM IST

అనంతపురం నాలుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రాంనగర్ , మారుతి నగర్ డివిజన్ లలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్స్, పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లు, హింసకు తావు లేకుండా పోలీసులతో సహకరించాలన్నారు. ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బు పంపిణీ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details