ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్రలు, రాళ్లతో దాడి చేసి.. వ్యక్తి దారుణ హత్య - y.rampuram latest news

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురం వద్ద వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్​ రెడ్డి తెలిపారు.

police inspection
హత్యా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

By

Published : Apr 29, 2021, 10:54 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఓ వ్యక్తిని కొందరు దుండగులు రాత్రి హత్య చేశారు. ఉదయం విషయం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. ద్విచక్రవాహనంపై కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న వన్నూరుస్వామిని అడ్డగించి కర్రలు, రాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతుడు.. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామవాసిగా గుర్తించినట్లు ఎస్సై రమేశ్​ రెడ్డి తెలిపారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details