అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో యువతి హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజేశ్ సహా అతని స్నేహితుడు కార్తీక్‌ను ధర్మవరం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజేశ్‌ను ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని వివిధ పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే బాధిత తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకోని పోలీసులపై చర్యల తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.