అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో శాతవాహనుల కాలం నాటి వినాయక ప్రతిమ బయటపడింది. ఇది రెండవ శతాబ్దానికి చెందినట్లుగా పురావస్తు పరిశోధకుడు కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి పేర్కొన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆహ్వానం మేరకు పురావస్తు శాఖ బృందం ఆ ప్రాంతాల్లో అన్వేషణ జరిపారు.
అతి పురాతనుడు ఈ వినాయకుడు
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో పురాతన వినాయక విగ్రహం లభించింది. ఇది రెండవ శతాబ్దానికి చెందినట్లుగా పురావస్తు పరిశోధకులు పేర్కొన్నారు.
పురాతన వినాయక విగ్రహం
ఈ క్రమంలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన.. మట్టి గణపతి విగ్రహాన్ని కనుగొన్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పురాతనమైన వినాయక విగ్రహమని కర్ణాటక చిత్రకళాపరిషత్కు చెందిన ఆచార్య ఆర్హెచ్ కులకర్ణి, తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన రామోజు హరగోపాల్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ..ఎమ్మెల్యే ఇంటి ఎదుట పవన్ అభిమానులు ఆందోళన