కనువిందుగా 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం - ramayanam
అనంతపురంలోని 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవంలో చిన్నారులు చేసిన నృత్యాలు అక్కడి ప్రజలను మంత్ర ముగ్ధులను చేశాయి. బాల రామాయణం చూపరులను కట్టిపడేసింది. వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రముఖ నృత్య కళాకారుడు శివశంకర్ మాస్టర్ హాజరైనారు.
![కనువిందుగా 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3330463-474-3330463-1558319129214.jpg)
పెద్దలను కనువిందు చేసిన 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం
అనంతపురంలో 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నృత్య కళాకారుడు శివశంకర్ మాస్టర్ పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు. చిన్నారులు చేసిన నృత్యాలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. లవకుశల నాట్యంతో చిన్నారులు ప్రేక్షకుల మనసులు దోచేశారు.
కనువిందుగా 'నటరాజ నృత్య శిక్షణాలయం' వార్షికోత్సవం