ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని రైతులకు మద్దతుగా.. అనంతలో ఆందోళన - amaravati parirakshana samiti andolana latest news update

అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మెడకు ఉరితాళ్లు కట్టుకొని సమితి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Amravati Conservation Society protest for capital
అనంతలో అమరావతి పరిరక్షణ సమితి ఆందోళన

By

Published : Dec 1, 2020, 1:41 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. రైతుల ఆందోళనలు 350 రోజులకు చేరుకున్న సందర్భంగా.. అనంతపురం జిల్లా కదిరిలో మెడకు ఉరితాళ్లు కట్టుకొని సమితి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించి.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనను విరమింప చేయాలని రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details