రాజధాని రైతులు చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రిలే దీక్ష చేపట్టారు. మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 150 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి సంఘీభావం తెలుపుతూ కదిరిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిరక్షణ సమితి సభ్యులు ప్ల కార్డులతో రిలే దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ పరిరక్షణ సమితి సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
అమరావతి పరిరక్షణ సమితి సభ్యుల రిలే దీక్ష విరమణ - అమరావతి వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులకు సంఘీభావంగా అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రిలే దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిరక్షణ సమితి సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు రిలే దీక్ష విరమణ
TAGGED:
ananthapuram district