ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి చిత్రపటానికి... పాలాభిషేకం - latest ammavodi news in guntakal

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  అమ్మఒడి పథకం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. పలు చోట్ల విద్యార్థులు, తల్లులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి... ధన్యవాదలు తెలిపారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి... విద్యార్థులు, మహిళలు పాలాభిషేకం
ముఖ్యమంత్రి చిత్రపటానికి... విద్యార్థులు, మహిళలు పాలాభిషేకం

By

Published : Jan 10, 2020, 12:04 AM IST

ముఖ్యమంత్రి చిత్రపటానికి... విద్యార్థులు, మహిళలు పాలాభిషేకం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పిల్లలను బడికి పంపే పేద తల్లులకు ఏటా 15 వేల రూపాయలు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

గుంతకల్లులో అమ్మఒడి కార్యక్రమం

గుంతకల్లులో అమ్మ ఒడి కార్యక్రమాన్ని మండల తహసీల్దార్, మండల అభివృది అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. పట్టణ, గ్రామీణ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు అమ్మఒడి ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణ,గ్రామీణ ప్రాంతాలలోని ఒకటో తరగతి నుండి ఇంటర్ చదివే విద్యార్థుల 27వేల 855 మంది అర్హులుగా ఎంపికయ్యారన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి రూ.15000 చొప్పున నగదును వేశామని తెలిపారు. ఎంపిక కానీ తల్లిదండ్రులకు అధికారులతో మాట్లాడి మరో అవకాశం కల్పించి ఎంపిక చేస్తామని అన్నారు. అనంతరం మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details