అనంతపురం జిల్లా శింగనమలలో నివాసం ఉంటున్న నాగలక్ష్మమ్మ బ్యాంకు ఖాతాలో అమ్మఒడి నగదు జమ అయింది. పండుగ పూట డబ్బును డ్రా చేసుకుని సంబరాలు చేసుకుందామని... లక్షమ్మ బ్యాంకుకు వెళ్లింది. చివరికి ఆమెకు నిరాశే మిగిలింది. బ్యాంకు మేనేజర్ ఆమె సొమ్మును అప్పులో జమ చేసుకున్నామని సమాధానం ఇచ్చారు. బాధితురాలు అప్పును తర్వాత చెల్లిస్తానని చెప్పినా పట్టించుకోలేదు. ఈ పరిణామంతో నాగలక్ష్మమ్మ కన్నీటి పర్యంతమైంది. బ్యాంకు మేనేజర్ తనను బెదిరించాడని ఆవేదన చెందింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
అమ్మఒడి నగదు అప్పులోకి జమ... తల్లి ఆవేదన! - అనంతపురం జిల్లాలో అమ్మఒడి నగదును ఇవ్వటానికి బ్యాంకు నిరాకరణ
అనంతపురం జిల్లా శింగనమలంలో అమ్మఒడి డబ్బులు వచ్చాయన్న సంతోషం... ఆ ఇంట్లో కొంతసేపు కూడా నిలవలేదు. బ్యాంకు అధికారులు నగదు ఇవ్వకుండా... అప్పులోకి జమ చేసుకున్నామని తెలపేసరికి బాధితురాలికి తీవ్ర నిరాశ మిగిలింది.
అమ్మఒడి నగదు అప్పులోకి జమ... తల్లి ఆవేదన!