రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యనించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన... వైకాపా ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు దేవాలయాలుగా మారతాయని చెప్పారు. పార్లమెంట్లో కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా షరతులతో కూడిన మద్దతు తెలిపిందని గుర్తుచేశారు.
రైతులకు మద్దతు తెలపడానికే రాష్ట్రంలో ఇవాళ బంద్కు పిలుపునిచ్చామన్నారు. గత 18 నెలల కాలంలో మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 3,700 కోట్లు ఖర్చుచేశామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజల సంక్షేమ కోసం వైకాపా నిరంతరం కృషిచేస్తోందని తెలిపారు.