గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని మంత్రి శంకర్నారాయణ అన్నారు. అనంతపురం జిల్లాకు నూతనంగా కేటాయించిన 108, 104 వాహనాలను... మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ప్రారంభించారు.
అత్యవసర వైద్యం అవసరమైన వారు 108 కి ఫోన్ చేసిన పదిహేను నిమిషాల్లోనే... రోగి ఇంటి వద్దకు చేరుకునేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. సీఎం జగన్ ప్రజల ఆరోగ్యం విషయంలో అనేక సంస్కరణలు చేస్తున్నారని కొనియాడారు.