ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్యాంగదినోత్సవం రోజున..రాజ్యాంగ నిర్మాతకు అవమానం - గోతిలో అంబేడ్కర్ విగ్రహం

రాజ్యాంగ దినోత్సవం రోజున సాక్షాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు అవమానం జరిగింది. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు వివాదానికి దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాయి. దీన్ని నిరసిస్తూ మరో వర్గంవారు విగ్రహన్ని గోతిలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు.

రాజ్యాంగదినోత్సవం రోజున..రాజ్యాంగ నిర్మాతకు అవమానం
రాజ్యాంగదినోత్సవం రోజున..రాజ్యాంగ నిర్మాతకు అవమానం

By

Published : Nov 26, 2020, 8:05 PM IST

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు అవమానం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయటానికి కొంత మంది ప్రయత్నించగా.. మరికొందరు అడ్డు చెప్పారు. దీన్ని నిరసిస్తూ...విగ్రహ ఏర్పాటు కోసం తీసిన గోతిలో విగ్రహాన్ని ఉంచి ఓ వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు. అధికారపార్టీ నేతల అండదండలతో విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారని వారు ఆరోపించారు. రాజ్యాంగదినోత్సం రోజున ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగదినోత్సవం రోజున..రాజ్యాంగ నిర్మాతకు అవమానం

ABOUT THE AUTHOR

...view details