రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన నిరసనలు 300వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టాయి. అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి, తెదేపా మూడు రోజులపాటు నిరసన ప్రదర్శనలు చేపడుతోంది. రాజధాని ప్రాంత రైతులకు మద్దతు తెలుపుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాలలో కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం లీగ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు ప్లకార్డులతో రిలే దీక్షలు చేపట్టారు.
కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి నిరసన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి, ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి.
కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి నిరసన