Amaravathi JAC News: అమరావతి పట్ల ముఖ్యమంత్రి జగన్ వైఖరి సరిగా లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్ శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ కార్యదర్శి గద్దె తిరుపతిరావుతోపాటు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ ఇంఛార్జీ ఉమామహేశ్వర నాయుడును కలిసి తమ ఉద్యమానికి సహకరించాలని కోరారు. 800 రోజులకు పైగా అమరావతి రైతులు ఉద్యమం చేపట్టినా జగన్ స్పందించడంలేదని.. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ ఏకం కావాలన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ.. రివర్స్ పాలన సాగిస్తున్నారాని జేఏసీ కార్యదర్శి గద్దె తిరుపతిరావు ఆరోపించారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో.. ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్లు తిరుపతిరావు స్పష్టం చేశారు.
Amaravathi JAC: 'అమరావతి పట్ల జగన్ తీరుకు నిరసనగా ఉద్యమిస్తాం' - anantapur district news
Amaravathi JAC Fires on cm jagan: రాజధాని అమరావతి పట్ల సీఎం జగన్ తీరు సరిగా లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్ శివారెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జీ ఉమామహేశ్వర నాయుడును కలిసి తమ ఉద్యమానికి సహకరించాలని కోరారు.
amaravathi jac leader Shiva reddy