కరోనా నిబంధనల మేరకే వినాయక ఉత్సవాలను అనుమతి ఇవ్వాలని భాజపా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అనంతపురంలో భాజపా నాయకులు తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వినాయక విగ్రహాల తయారీ వ్యాపారులు, భాజపా నాయకులు నిరసన చేపట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు.
'కరోనా నిబంధనల మేరకే గణేశ్ ఉత్సవాలకు అనుమతివ్వండి' - గణేశ్ ఉత్సవాలకు అనుమతివ్వండి
కరోనా నిబంధనల మేరకే గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకునేలా అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. అన్ని మతాల పండుగలను కరోనా నిబంధనల మేరకు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు.
దీనిపై భాజపా నాయకులు స్పందిస్తూ రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను కరోనా నిబంధనల మేరకు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఉత్సవాలను అడ్డుకున్నామని డీఎస్పీ వీరరాఘవ రెడ్డి సమాధానమిచ్చారు. కరోనా థర్డ్ వేవ్ ముంపు ముందుంది కాబట్టి ప్రభుత్వ ఆదేశాలును పాటిస్తున్నామన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:Vinayaka chaturthi 2021: సెప్టెంబర్ 10 నుంచి గణేశ్ ఉత్సవాలు