హైటెక్ స్థాయిలో.. ఓటర్లకు డబ్బు పంపిణీ?? - ap elections 2019
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని వైకాపా నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు బయటికి వచ్చాయి.
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని వైకాపా నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు బయటికి వచ్చాయి. కొందరు వ్యక్తులు వైకాపా తరఫున ఓటర్లను కలుస్తూ.. ఆ పార్టీ ముద్రించిన కార్డులు పంచుతున్నట్టు తెలిసింది. 7, 8వ తేదీల్లో తాము చెప్పిన చోటుకు వెళ్లి.. ఆ కార్డులు చూపిస్తే డబ్బులు ఇస్తారని ప్రలోభానికి గురి చేస్తున్నట్టుగా.. అక్కడి ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. కేసు నమోదైంది.