దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్న మహిళలకు రాయితీ ఇస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ప్రకటించడం వివాదానికి దారి తీసింది. పట్టు చీరలపై 10 నుంచి 20 శాతం, మొబైల్ ఉత్పత్తుల కొనుగోలుపై దుకాణాల్లో 10 శాతం తగ్గిస్తామని చెప్పారు. వస్త్ర వ్యాపారులు, వైకాపా నేతలతో సమావేశం అనంతరం.. ఆయన ఈ విధంగా పేర్కొనడంపై పలువురు విమర్శిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సమయంలో.. వైకాపా నేతలు, పట్టుచీరల వ్యాపారులతో డీఎస్పీ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ రాయితీ ప్రకటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.