ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్​పై అలక.. 12 మంది వీఆర్వోల సామూహిక సెలవు - ఉరవకొండలో వీఆర్వోలు సామూహిక సెలవు

అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్.. వీఆర్వోలకు మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఇతర శాఖల అధికారుల ఎదుట తమను అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ 12 మంది వీఆర్వోలు ఒకేసారి సామూహిక సెలవును ప్రకటించారు.

all vros leave
all vros leave

By

Published : Jul 11, 2020, 10:29 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో వీఆర్వోలు, తహసీల్దార్​ల మధ్య వివాదం నెలకొంది. ఇతర శాఖల అధికారుల ముందు తహసీల్దార్ తమను అవమానకరంగా మాట్లాడారని వీఆర్వోలు ఆరోపించారు. తాము సామూహిక సెలవులో వెళ్తున్నట్లు మండలానికి చెందిన 12 మంది వీఆర్వోలు శుక్రవారం సాయంత్రం తెలిపారు.

ఉదయం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ క్రాప్​ నమోదు శిక్షణ కార్యక్రమంలో.. ఇతర శాఖల సిబ్బంది ఎదురుగా.. ఎమ్మార్వో అవమానకరంగా మాట్లాడారని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ తాము సామూహిక సెలవులో వెళ్తున్నామన్నారు. తమకు సామూహిక సెలవు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్​కు రాతపూర్వకంగా తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details