ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం' - grama sachivalayam exams in ap 2020

ఈ నెల 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు అనంతపురం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ సిరి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 135 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశామని తెలిపారు.

jc siri
jc siri

By

Published : Sep 17, 2020, 5:11 PM IST

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలకు అనంతపురం జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతపురం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లును క్లస్టర్లుగా విభజించి... మొత్తం 135 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించామని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details