ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు ఖాతాల్లో పంట బీమా జమ చేయాలి'

శింగనమల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఎదుట తెదేపా, సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. పంట నష్టానికి సంబంధించి, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులందరికీ వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

All party dharna for Crop insurance
ఇన్సూరెన్స్ ప్రీమియం

By

Published : Dec 22, 2020, 6:14 PM IST

అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం ఎదుట తెదేపా, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. పంట నష్టానికి సంబంధించి, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులందరికీ వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లకు సంబంధించిన బీమాను పంట నష్టపోయిన వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలతో రైతులకు తీవ్ర ఆవేదన మిగిలిందని తెలిపారు. అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని వాపోయారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేనిపక్షంలో పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'సచివాలయం మా గ్రామంలోనే ఏర్పాటు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details