నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు.. ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానపరచిన ప్రభుత్వానికి పతనం తప్పదని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, వామపక్ష పార్టీలతోపాటు ఉద్యోగ ,కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
'రైతులను అవమానపరిచిన ప్రభుత్వానికి పతనం తప్పదు' - కదిరిలో రౌండ్ టేబుల్ సమావేశం
రాజధానికి 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ప్రభుత్వం అవమానించిందని.. అలాంటి ప్రభుత్వానికి పతనం తప్పదని అఖిలపక్ష నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రౌండే టేబుల్ సమావేశం
TAGGED:
కదిరిలో రౌండ్ టేబుల్ సమావేశం