కోడి మాంసం తింటే కరోనా వస్తుందనే అపోహతో పౌల్ట్రీ రంగం కుదేలయ్యింది. ఈ క్రమంలో గిట్టుబాటు ధర లేక 12 వేల కోళ్లను సజీవ సమాధి చేశాడో కోళ్లఫారం యజమాని. ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం ఈదుల బలాపురంలో ఉన్న లోటస్ పౌల్ట్రీ ఫారంలో జరిగింది. తమకు వచ్చే రాబడి కంటే, కోళ్లను పోషించేందుకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని ఫారం యజమాని ఈ విధంగా చేశారు. ముఖ్యంగా దాణా దొరకకపోవటం వల్ల కోళ్లను సాకలేక ఇలా చేసినట్లు వారు వాపోయారు. కోళ్లను పూడ్చివేస్తున్నారనే సమాచారం అందటంతో పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామస్తుల సైతం కోళ్లను పట్టుకువెళ్లేందుకు ఎగబడ్డారు.
బతికున్న కోళ్లను పూడ్చిపెట్టేశాడు... ఎందుకంటే...! - సోమందేపల్లిలో బతికి ఉన్న కోళ్లను పూడ్చిపెట్టేశాడు
కరోనా ప్రభావం పౌల్ట్రీ రంగంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అద్దంపట్టే సంఘటన ఇది. అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామంలో గిట్టుబాటు ధర లేక కోళ్లఫారం యజమాని ఏమి చేశాడో చూడండి.
బతికి ఉన్న కోళ్లను పూడ్చిపెట్టేశాడు.... ఎందుకంటే...!