ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్మికులపై ప్రభుత్వాలు కపటప్రేమ చూపిస్తున్నాయి' - అనంతపురం ప

అనంతపురం బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో నిరసన చేశారు. పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు పూర్తివేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

aituc citu protest at ananthapur bsnl office because of not giving their full salaries
బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయం వద్ద ఏఐసీటీయూ,సీఐటీయూ కార్మిక సంఘాల ధర్నా

By

Published : May 22, 2020, 6:43 PM IST

కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమని చూపిస్తున్నాయని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అనంతపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికులను దోపిడి చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కూలీలు లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించకుండా యధావిధిగా కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.

బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయం వద్ద ఏఐసీటీయూ, సీఐటీయూ కార్మిక సంఘాల ధర్నా

ABOUT THE AUTHOR

...view details