ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్ల కొన్ని విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అలాంటి కళాశాలలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయం ఏవో యోగేశ్వ్కు వినతి పత్రం అందజేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి: ఏఐఎస్ఎఫ్ - ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఏవో యోగేశ్వ్కు వినతి పత్రం అందజేశారు.
ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ధర్నా