ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల నుంచే నేరుగా విత్తనాలు కొనుగోలు - అనంతపురం జిల్లా తాజా వేరుశనగ విత్తనాలు న్యూస్

అనంతపురం జిల్లా పెనుగొండలోని వేరుశనగ విత్తన ప్రొసెసింగ్​ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మధ్యవర్తులు లేకుండా విత్తనాలను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేయటానికి తగిన కార్యచరణ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

వేరుశనగ విత్తన ప్రాసెసింగ్​ను పరిశీలించిన వ్యవసాయం శాఖ కమిషనర్

By

Published : Nov 8, 2019, 11:59 PM IST

వేరుశగన విత్తన ప్రాసెసింగ్​ను పరిశీలిస్తున్న వ్యవసాయం శాఖ కమిషనర్
అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని శ్రీ సత్య సాయి రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సమాఖ్యలోని వేరుశెనగ విత్తన ప్రొసెసింగ్​ను వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు రబీలో 2020నాటికి అవసరమయ్యే నాలుగున్నర లక్షల క్వింటాళ్ల వేరుశెనగను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుంచి ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్​తో పాటు ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు , సీడ్స్ జేడీఏ కృపాదాస్, అనంతపురం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు హబీబ్ బాషా తదితురులు పాల్గొన్నారు.


ఇదీ చూడండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details