ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rythu Bharosa: రూ.400 కోట్లతో 1898 రైతు భరోసా కేంద్రాలు.. ఈనెల 8న ప్రారంభం

రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 8న అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. రూ. 400 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 1898 రైతు భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Rythu Bharosa
Rythu Bharosa

By

Published : Jul 3, 2021, 6:26 PM IST

రూ. 400 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 1898 రైతు భరోసా కేంద్రాలను రైతు దినోత్సవం రోజున ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 8న అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్​లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఊడేగోళం గ్రామంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం, ముఖ్యమంత్రి సమావేశ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు.

జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 1898 రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందుబాటులో రానున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మరో 10 వేల రైతు భరోసా కేంద్రాలు రానున్న 4 నెలల్లో పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరిశీలించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 90 లక్షలతో అగ్రిల్యాబ్​లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తైన 70 అగ్రి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్​లను సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అగ్రి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్​లు అందుబాటులోకి రావడం వల్ల నకిలీ విత్తనాలు, పురుగులమందు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రతి గ్రామంలో రైతు సంఘానికి రూ. 15 లక్షలు విలువ చేసే ట్రాక్టర్ పరికరాలు, కల్టివేటర్, గ్రౌండ్​నట్ పరికరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కనబరచిన 13 మంది రైతులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఈనెల 8న అనంత రైతులతో ముఖ్యమంత్రి జగన్​ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.

ఇదీ చదవండి:

'వ్యాపారస్థుల సాధికారతకు కట్టుబడి ఉన్నాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details