అనంతపురం జిల్లా గార్లదిన్నే మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు. గ్రామ స్వరాజ్యం స్థాపించాలన్న లక్ష్యంతో... ఈ కేంద్రాలను ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిందన్నారు. దీనివల్ల వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అన్నదాతల వద్దకే అందుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
'ఇక ఆర్బీకేలతో గ్రామాల్లో వ్యవసాయ సేవలు' - అనంతపురంలో రైతు భరోసా కేంద్రాల సేవలు
గ్రామస్థాయిలో వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల సేవలను అందించాలనే ఉద్దేశంతో... రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
!['ఇక ఆర్బీకేలతో గ్రామాల్లో వ్యవసాయ సేవలు' RBKs are essential to farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7409642-430-7409642-1590849001463.jpg)
ఆర్బీకేల ప్రాముఖ్యాన్ని వివరిస్తోన్న ఎమ్మెల్యే పద్మావతి